తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ కి మించిన అందం.. అంతకుమించి మధురమైన స్వరంతో ప్రేక్షకులను అలరిస్తున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో పాటల ద్వారా అంతే మంచి అభిమానులను కూడా సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా సర్వే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టాక భర్త కిరణ్ తో గొడవలు పడి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే వీరి విడిపోవడానికి కారణం స్టార్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య అనే ప్రచారం కూడా అప్పట్లో బాగా జోరుగా సాగింది. ఆయన కూడా సునీత భర్త కిరణ్ కు మంచి ఫ్రెండే నట అతడు సునీతకు వరుస ఆఫర్లు ఇవ్వడంతో పరిశ్రమల వీరిద్దరి మధ్య గుసగుసలు కూడా మొదలయ్యాయి. ఇక ఈ విషయం కాస్త కిరణ్ చెవిన పడడంతో తరచూ సునితను అవమానించే వాడట. దీంతో భర్త వేధింపులకు తాళలేక సునీత విడాకులు ఇచ్చి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసింది. ఈ సంఘటన తర్వాత సునీత ఆదిత్య నే పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఫిలింనగర్లో వార్తలు కోడై కూసాయి.
కానీ అందులో నిజం లేకపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రముఖ మీడియా వ్యాపారవేత్త మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. ఇకపోతే రామ్ ను వివాహం చేసుకున్నప్పుడు కూడా ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. అయితే సునీత రెండో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ పుకార్లు వస్తూనే ఉండడం గమనార్హం.