ఈ అలవాట్లని మానేస్తే.. డిప్రెషన్ ఏ రాదు..!

-

చాలామందిలో ఈ గుణాలు ఉంటాయి. దీని వలన డిప్రెషన్ కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు అద్భుతమైన విషయాలని డాక్టర్లు చెప్పారు వీటిని కనుక మీరు చూసి ఆచరిస్తే ఖచ్చితంగా డిప్రెషన్ వంటి ఇబ్బందులు రావు. ఆరోగ్యంగా ఉండొచ్చు. డైట్ లో బ్రెయిన్ ఫుడ్ ని తీసుకోవడం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం చాలా అవసరం అటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. చేపలు పుట్టగొడుగులు వంటివి తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు.

 

ఇల్లు మూసుకుపోయి ఉండకూడదు ప్రతికూల ఆలోచనలు పెంచడానికి దారితీస్తుంది. సూర్యకాంతి ఇంటి లోపల పడాలి. శరీరంలో విటమిన్ డి లోపాన్ని ఇది తగ్గిస్తుంది. పైగా పాజిటివ్ ఎనర్జీ ని కూడా ఇది తీసుకు వస్తుంది. కనీసం రోజు అర గంట అయినా సూర్యరశ్మిని పొందండి తక్కువ నిద్రపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. రోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలసేపు నిద్రపోవడం మంచిది.

మొబైల్ టీవీ వంటి వాటికి దూరంగా ఉండి నిద్రపోండి. కెఫిన్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర పాడవుతుంది నిద్ర పాడైతే ఆరోగ్యం పాడవుతుంది. డిప్రెషన్ వంటి వాటికి దారితీస్తుంది. చాలామంది ఒత్తిడి వలన ఇబ్బంది పడుతుంటారు. ఒత్తిడి ఎక్కువగా ఉంటే డిప్రెషన్ లోకి వెళ్లి పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి నిరాశకి గురి కాకూడదు ఒంటరిగా కాకుండా స్నేహితులతో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపితే కచ్చితంగా బాగుంటారు పాజిటివ్ గా ఉండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news