పెళ్లి చేసుకున్న నయనతార.. వీడియో వైరల్‌ !

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌-నయన తార ప్రస్తుతం లవ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో… తమిళనాడులోని ప్రముఖ ఆలయాన్ని విగ్నేష్‌ శివన్‌-నయన తార సందర్శించారు. అక్కడ నయనతారను చూసిన సాధారణ భక్తులు ఆమెతో సెల్పీలు దిగడానికి పోటీ పడ్డారు. అదే సమయంలో ఆమె వీడియోలు కూడా తీశారు. సదరు వీడియోలో నయనతార పాపిక కుంకుమ పెట్టుకుని కనిపించారు. భారతీయ సాంప్రదాయంలో పెళ్లి అయిన స్త్రీలు మాత్రమే పాపిట కుంకుమ పెట్టుకుంటారు.

ఈ నేపథ్యంలోనే విగ్నేష్‌, నయనతార హడావుడి లేకుండా.. రహస్యంగా వివాహం చేసుకుని ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు.వారిద్దరి ప్రవర్తన కూడా అలాగే ఉంది. పేరుకే ప్రేమికులు కానీ భార్య భర్తలకు మించి సన్నిహితంగా ఉంటున్నారు. ప్రేమికుల రోజు అర్ధరాత్రి విఘ్నేష్ ఇంటిని సందర్శించిన నయనతార పూల గుచ్చంతో ఆయనకు విషేస్‌ తెలియజేశారు. మొత్తానికి వీరి వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

https://twitter.com/suria____/status/1502247713043193861?s=20&t=Fu5LfzQjncHnEkpk7CKbBA

https://twitter.com/nayantharafeeds/status/1502600990389727234?s=20&t=Fu5LfzQjncHnEkpk7CKbBA

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version