సుమన్ జైలుకెళ్లడానికి ఆ ముఖ్యమంత్రే కారణమా..?

-

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సుమన్ చాలా సంవత్సరాల క్రితం జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం ఆయన అభిమానులను ఎంతో కలవర పెట్టింది.అప్పట్లో సుమన్ జైలుకు వెళ్లడానికి ఒక స్టార్ హీరో కారణం అని వార్తలు కూడా వినిపించాయి. అయితే సుమన్ జైలుకెళ్లడానికి ప్రధాన కారణం ముగ్గురు వ్యక్తులు అని తాజాగా డైరెక్టర్ సాగర్ ఈ విషయాలను వెల్లడించారు.

అసలు విషయంలోకెళితే తెలుగుతోపాటు ఇతర భాషల్లో 700కు పైగా సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న సుమన్ ను అదే సమయంలో బూతు చిత్రాలను తీసినట్టు ఆరోపించి ఆయనను అరెస్టు చేయించారు. సుమన్ జైలు జీవితం గడపడానికి కారణం అప్పటి తమిళనాడు మాజీ సీఎం ఎంజిఆర్..తో పాటు డిజిపి, వడియార్ అనే లిక్కర్ కాంట్రాక్టర్ సుమన్ జైలుకు వెళ్లడానికి కారణం అని తెలిపారు. ఇకపోతే సుమన్ ఫ్రెండ్ ఒకరు లిక్కర్ కాంట్రాక్టర్ కూతురిని ప్రేమించగా.. డిజిపి కూతురికి సుమన్ అంటే ఇష్టమని సాగర్ తెలిపారు.

ఇక సుమన్ షూటింగ్ ఎక్కడ జరిగినా సరే ఆ అమ్మాయి అక్కడ ఉండేదని, తన కూతురు సుమన్ ట్రాప్ లో పడిందని, డీజిపి సీఎంకు చెప్పారని.. ఇక సుమన్ ఫ్రెండ్ వ్యవహారం కూడా సీఎంకు తెలిసిందని.. దీంతో సీఎం సుమన్ తో డిజిపి కూతురికి దూరంగా ఉండాలని కూడా చెప్పారట. అయితే సుమన్ నాకు కాదు ఆ అమ్మాయికి చెప్పాలని కోరడంతో ఎంజీఆర్ కోపం వచ్చి తప్పుడు కేసులు పెట్టి సుమన్ ను అరెస్టు చేయించారని వెల్లడించారు. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news