టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది సమంత.. అలాగే ఈమె నటించిన శకుంతల సినిమా త్వరలోనే అభిమానుల ముందుకి రాబోతున్న సందర్భంగా.. ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అయితే వీటన్నిటిలో సమంత చేతిలో ఒక జపమాలో ఉండటం విశేషం.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ జపమాల.. అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే..
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత ఎక్కడ కనిపించినా ఆమె చేతిలో ఉన్న జపమాల అందరిని ఆకర్షిస్తుంది.. తాజాగా ముంబై ఎయిర్పోర్టులోను.. శకుంతల సినిమా ఇంటర్వ్యూలోను.. ఇదే జపమాలతో కనిపించింది సమంత.. అయితే నాగచైతన్యత విడాకులు అనంతరం మానసికంగా కృంగిపోయిన సమంత ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడింది.. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటుంది అయితే ఈ నేపథ్యంలో.. మంచి ఆరోగ్యం, శాంతి కోసం ప్రతిరోజు 10,008 శ్లోకాలు జపం చేస్తోందట. అలాగే మలయాళీ క్రిస్టియన్లు కూడా ఇలాంటి పూసలతో ‘రోసరీ’ చేస్తారని తెలిసిందే. కానీ సామ్ కొన్నాళ్ల క్రితమే హిందూ మతంలోకి మారింది. దీంతో గత వారం రోజులుగా హిందూ జపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కడికెళ్లినా జపమాల తో కనిపిస్తుందని ఈ జపాలను పటిస్తూ తనం తాను దృఢంగా మార్చుకుంటుందని సమాచారం అయితే ఇదే విషయాన్ని సమంత కూడా నేరుగా తెలిపినట్టు తెలుస్తోంది..
అలాగే సమంతకు ఆధ్యాత్మిక భావన ఎక్కువనే చెప్పాలి ఇప్పుడు గుడిలో వెంట కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవుని కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే తాను ఈ సమస్యలన్నీటి నుంచి బయటపడటానికి తనను తాను మానసికంగా దృఢంగా మార్చుకోవడానికి ఆధ్యాత్మిక భావనను ఎంచుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈ జపమాలను విడిచిపెట్టడం లేదని సమాచారం..