అడివి శేష్ ‘గూఢచారి-2’ అప్డేట్ వచ్చేసింది

-

అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఫ్లాప్ అనే పదం కూడా అడివి శేష్‌కు ఆమడ దూరంలో ఉంటోంది. ఎవరు, మేజర్, హిట్ 2 ఇలా హిట్లు కొడుతూనే ఉన్నాడు. ఏ జానర్‌ టచ్ చేసినా కూడా అడివి శేష్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పుడు మరోసారి స్పైగా రచ్చ చేయబోతున్నాడు. ఆయన సూపర్ హిట్‌ ఫిల్మ్ `గూఢచారి 2`లో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో `గూఢచారి 2` ఫస్ట్‌ లుక్‌ని రివీల్‌ చేశారు.

ఈ సందర్భంగా ప్రీ విజన్‌ పేరుతో ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో యాక్షన్‌ మూడ్‌లో ఉన్న అడవిశేష్‌ అదరగొట్టారు. ఫార్మల్‌ వేర్‌లో స్లీక్‌గా, స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. బిల్డింగ్‌ నుంచి పడిపోతూ ఒకరిని కాల్చడం విశేషం. ఈ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. అంతేకాదు శేష్‌ ఇండియా నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు గూఢచారిగా అతని విజువల్స్ ని చూపించారు. ఈ ప్రీ విజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

`గూఢచారి`లో అడవిశేష్‌ ఇండియన్‌ స్పైగా కనిపిస్తుండగా, ఇప్పుడు సీక్వెల్‌లో అంతర్జాతీయ స్పైగా కనిపించబోతున్నాడని చిత్ర బృందం తెలిపింది. ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి `మేజర్‌` ఎడిటర్‌ వినయ్ కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా మారుతున్నారు. ఈ స్టోరీని అడవిశేష్‌ అందించడం విశేషం. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైనర్మెంట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version