మహేష్ పై ఎలాంటి గాసిప్స్ రాకుండా ఉండటానికి కారణం ఇదేనా.. !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇంత సూపర్ స్టార్ స్టేజ్ లో ఉన్న మహేష్ బాబు పైన ఎప్పుడు ఎలాంటి గాసిప్స్ రావడం తెలియదు ఏ హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నాడు అన్నమాట కూడా వినిపించదు. అయితే ఎందుకు గల అసలు కారణాలేంటో తెలుసా..

మహేష్ బాబు కెరీర్ నో ఫ్యామిలీను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు ముఖ్యంగా ఆయన తన ఫ్యామిలీ కి ఇచ్చే ప్రధాన్యత చెప్పుకోవాల్సిన విషయం బయట కూడా ఎక్కువ స్నేహితులతో కనిపించని మహేష్ ఎక్కడికి వెళ్లినా తన వెంట భార్య పిల్లలు ఉంటూనే ఉంటారు అయితే ఇంత నిబద్ధతతో కుటుంబ విషయంలో మహేష్ ఉండటానికి అసలు కారణం ఆయన పెరిగి వచ్చిన పరిస్థితులని చెప్పవచ్చు..

మహేష్ బాబు పూర్తి నిబద్దతతో, కుటుంబానికి మాత్రమే విలువ ఇస్తూ.. అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండటానికి అసలైన కారణం ఆయన జీవితాన్ని వెనక ఉండే నడిపించిన ఇద్దరు వ్యక్తులు.. వారు ఎవరంటే.. ఒకరు మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి గారు అలాగే మరొకరు ఇందిరా దేవి గారి అమ్మ దుర్గమ్మ గారు. తన చిన్నతనం నుంచి మహేష్ ఎక్కువగా తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గరే పెరిగారు. ఆవిడా మహా స్ట్రిక్ట్ పర్సన్.. అలాగే సినిమాల తాలూకు నీడ కూడా అతడిపైకి రాకుండా ఉండాలని దుర్గమ్మ ప్రయత్నించారట.. కానీ అది జరగలేదు అలాగే పెళ్లి విషయంలో కూడా నమ్రతను తొలుత ఆవిడ ఒప్పుకోలేదట.. అలాగే కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల తన కూతురికి అన్యాయం జరిగిందని ఆమె పడిన బాధను మహేష్ కళ్ళారా చూసేవాడు అంట.. సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక సైతం తన తండ్రి విజయ నిర్మల తో ఉండటం వల్ల తల్లి పడుతున్న మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన మహేష్ జీవితంలో తన వల్ల ఇంకేం ఆడపిల్ల బాధపడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు అంట అందుకే నమ్రతను ప్రేమించినప్పుడు తన కుటుంబం నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా అన్నింటినీ దాటుకొని తనని పెళ్లి చేసుకున్నారు పెళ్లి ఇన్ని సంవత్సరాలు అయినా అదే నిబద్దతతో మహేష్ కొనసాగుతున్నారు..