ఇషా చావ్లా నిషా ఎక్కిస్తుంది..

-

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రేమ కావాలి అనే సినిమాతో పరిచయం అయిన ఇషా చావ్లా, మొదటి సినిమాతో ఫర్వాలేదనిపించుకుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కావాలి సినిమాలో ఆది హీరోగా కనిపించాడు. డైలాగ్ కిమ్గ్ సాయి కుమార్ తనయుడు ఆది, ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఐతే ఈ సినిమాలో ఇషా చావ్లా తనదైన నటనతో బాగానే మెప్పించింది. దాంతో తర్వాతి అవకాశంగా కమెడియన్ సునీల్ తో అవకాశం వచ్చింది.

పూలరంగడు సినిమాలో ఇషా చావ్లా హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. అయితే ఆ తర్వాతే ఆమెకు ఫ్లాపులు మొదలయ్యాయి, శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్ళి కొడుకు, జంప్ జిలానీ, రంభ ఊర్వశి మేనక.. మొదలగు సినిమాలు రూపంలో పరాజయం చవి చూసాయి. దాంతో ఇషా చావ్లా మళ్లీ తెలుగులో కనిపించలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకున్న ఫోటోలు ఇషా చావ్లాలోని మరో కోణాన్ని చెబుతున్నాయి. ఇప్పటి వరకూ సినిమాల్లో కూడా ఇషా చావ్లా అంత గ్లామరస్ గా కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో. చాలా సాధారణంగా ఉన్నా కూడా ఏదో తెలియని కొత్తదనం ఆమెలో కనిపిస్తుంది. అప్పటి కంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. వైట్ టీ షర్ట్ లో, పదునైన చూపులతో, మత్తెక్కిస్తున్నట్టుగా ఇషా చావ్లా నిషా ఎక్కిస్తున్నట్టుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version