అతనితో పోల్చడం అవమానంగా వుంది – రాహుల్ రామకృష్ణ..!

-

నటుడు రాహుల్ రామకృష్ణ బలగం సినిమా హీరో ప్రియదర్శిని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇకపోతే తమ ఇద్దరి మధ్య పోలిక పెట్టడం సరికాదు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.. అసలు విషయంలోకెళితే.. స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధం లేని విషయాలలో కూడా తలదూరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఊహించని పోస్ట్లు పెడుతూ వార్తల్లో నిలిచే రాహుల్ రామకృష్ణ ఒకానొక సమయంలో నటన మానేస్తున్నానని చెప్పి ట్వీట్ చేశాడు.

ఇది తెలిసి అభిమానులు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారని అభిమానులు కూడా వివరణ కోరగా.. జస్ట్ జోక్ చేశాను అంటూ రీ ట్వీట్ చేశారు రాహుల్ రామకృష్ణ.ఇకపోతే తాజాగా ఒకరు బలగం , ఇంటింటి రామాయణం చిత్రాలను ఉద్దేశిస్తూ రాహుల్ , ప్రియదర్శి దూసుకుపోతున్నారని పోస్ట్ పెట్టారు. దీనిపై రాహుల్ రామకృష్ణ అభ్యంతరం చెబుతూ ప్రియదర్శితో నాకు పోలిక ఏంటి? అతడు నా మిత్రుడు.. కష్టపడే తత్వం కలిగిన గొప్ప నటుడు.. ఈ విధంగా నాతో ప్రియదర్శిని పోల్చడం చాలా చీప్ గా ఉంది. ఇది నేను ఒప్పుకోను.. ప్రియదర్శిని ఒక గొప్ప నటుడు అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో రాహుల్ రామకృష్ణ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది . నిజంగా రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిని పొగుడుతూ కామెంట్ చేశాడా? లేక సెటైర్ వేశాడా? అన్నది అర్థం కాలేదు.ఇకపోతే గతంలో కూడా హుషారు చిత్ర దర్శకుడు రాహుల్ రామకృష్ణ పైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక భరత్ అనే నేను సినిమాలో తన నటనతో పోటీ పడలేని మహేష్ బాబు నా సన్నివేశాలు ఎడిటింగ్ లో లేపేసాడని చెప్పాడని రాహుల్ రామకృష్ణ తనతో చెప్పినట్లు హుషారు డైరెక్టర్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఏ ఉద్దేశ్యంతో ట్వీట్ చేశాడో అర్థం కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version