Official : సుకుమార్ తో మహేష్ మూవీ క్యాన్సిల్

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే సుకుమార్ తో మహేష్ సినిమా ఉంటుందని అన్నారు అయితే సుకుమార్ చెప్పిన రెండు కథలు మహేష్ కు నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడట. ఇదే విషయాన్ని సోమవారం సాయంత్రం తన ట్విట్టర్ మెసేజ్ ద్వారా వెళ్లడించాడు మహేష్.

క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయ్యిందని మహేష్ చెప్పాడు. అయితే ఆయనతో సినిమా చేయకున్నా ఆయన చాలా మంచి దర్శకుడని అన్నారు. ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు మహేష్. అయితే మహేష్ సుకుమార్ ను కాదని అనీల్ రావిపుడితో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈమధ్యనే అనీల్ రావిపుడి చెప్పిన ఓ కథ బాగా నచ్చడంతో అనీల్ తో మహేష్ సినిమా దాదాపు కన్ ఫాం అయినట్టే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version