జాను ట్విట్టర్ రివ్యూ, మూవీ ఫీల్ అవుతారు…!

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ సినిమాకు రీమేక్ గా వచ్చిన చిత్రం జానూ మూవీ శర్వానంద్ సమంతా జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమాకు సంభందించిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా ట్విట్టర్ జాను రివ్యూ విషయానికి వస్తే… స్లో నేరేషన్ ఉన్నా సినిమా ఎంజాయ్ చేయవచ్చు. సినిమాను కచ్చితంగా ఫీల్ అవుతారు. లవ్ స్టోరీస్ నచ్చే వారికి సినిమా తప్పకుండా నచ్చుతుంది. సినిమా గనుక ఆసక్తిగా చూస్తే లీనం అయిపోతారు. యూఎస్‌లో ఇప్పటికే ‘జాను’ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. ట్విట్టర్ లో శర్వా హిట్ కొట్టేసాడు అంటూ ట్వీట్ లు వస్తున్నాయి.

ఫస్ట్ ఆఫ్ కాస్త స్లోగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మ్యాజిక్ ఉంటుందని అంటున్నారు. ఇక సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయని… ఫ్లాష్‌బ్యాక్‌లో స్కూల్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది అంటున్నారు. ఆ పాత్రల ఎంపికలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్త సినిమాను మరో రేంజ్ కి తీసుకువెళ్ళింది. సినిమాలో సంగీతం కూడా హైలెట్ గా నిలిచింది అంటున్నారు చూసిన వాళ్ళు.