మొత్తానికి అమ్మాయిలా మారిన జబర్దస్త్ కమెడియన్..!

-

ఈ మధ్యకాలంలో చాలామంది లింగమార్పిడి ద్వారా తమను తాము మరింతగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు సమాజంలో ఒక మగాడు ఆడదానిలా మారాలన్నా లేదా ఒక మహిళ ఒక పురుషుడి లాగా మారాలన్నా కూడా ఎంతో ప్రాసెస్ ఉండేది. ముఖ్యంగా వాళ్లు అలా మారాక కూడా ఎన్నో అవమానాలను ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. పుట్టుకతోనే వచ్చిన ఆ లోపం వల్ల చుట్టూ ఉన్న వారితో ఎన్నో అవమానాలు ఎదుర్కొనేవారు కానీ ఇప్పుడిప్పుడే లోకం మారుతుంది. ముఖ్యంగా వారిది కూడా ఒక జీవితమే అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు ప్రజలు.

అంతేకాదు న్యాయపరంగా వారికి హక్కులు కూడా ఉన్నాయని న్యాయస్థానాలు చెప్పుకొస్తున్నాయి. అందుకే చాలామంది ఇకపై స్వతంత్రంగా.. ధీమాగా.. హుందాగా తమకు నచ్చిన విధంగా తమను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందులో లేడీ గెటప్ వేసే వారిని వారి ఒరిజినల్ రూపంలో చూస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టడం కష్టమే. ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్ ద్వారా ఫేమస్ అయిన పింకీ బిగ్ బాస్ కి వెళ్లి అందరి మన్ననలు అందుకొని.. ప్రియాంక సింగ్ గా మారింది.

మరో జబర్దస్త్ నటుడు కూడా ఇప్పుడు అమ్మాయిగా మారాడు. అతడే సాయి లేఖ..ఈ మధ్యనే సర్జరీ చేయించుకొని లేడీగా మారిపోయిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నేను సర్జరీ చేయించుకోలేదు.. ఒకవేళ సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిగా మారుతానా? నాకు చిన్నతనం నుంచి చీరలు కట్టుకోవడం ఇష్టం.. అలాంటి ఆలోచనలే ఊహ తెలిసినప్పటి నుండి మొదలయ్యాయి. ఇక ఎవరు ఏమనుకున్నా.. నాకు అనవసరం.. నేను నా కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఇక నేను సర్జరీ చేయించుకుంటే వారికి ఎందుకు? లేకపోతే వారికి ఎందుకు? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది సాయి లేఖ.

Read more RELATED
Recommended to you

Latest news