పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ రీతూ చౌదరి . ఫొటోస్ వైరల్..!!

-

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లేడీ కమెడియన్ గా, టాలీవుడ్ ఆర్టిస్టుగా కూడా గీతూ చౌదరి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈమె గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తన పరిచయాన్ని పెంచుకొని.. ఒక రేంజ్ లో దూసుకెళ్తోంది. యూట్యూబ్ లో కూడా తన ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తూ మరింత ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఇక జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ లో వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ క్రమంలోనే తన అందంతో బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న రీతూ చౌదరి మొదట్లో టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. దీంతో ఈమెకు వెండితెరపై పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇక చాలావరకు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లోని నటించింది. ఇక బుల్లితెరపై గోరింటాకు సీరియల్లో అడుగుపెట్టి.. తన నటనతో మరింతగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి ఆ తర్వాత అమ్మ కోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది. జబర్దస్త్ లో అడుగుపెట్టి అందులో లేడీ కమెడియన్ గా మంచి సక్సెస్ అయ్యింది.

ఇక అందంలో ఏమాత్రం హీరోయిన్ రేంజ్ కు తీసిపోని రీతూ చౌదరి పొట్టి పొట్టి దుస్తులతో హాట్ ఫోజులతో మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క్రేజ్ రావడంతో ఒక్కోసారి హీరోయిన్ లా రెడీ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే రీతూ చౌదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె షేర్ చేసిన ఒక ఫోటోలో పెళ్లికూతురు గెటప్ లో తన తండ్రికి ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నేటిజన్స్ నిజంగానే రీతు చౌదరి పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? ఎప్పుడు పెళ్లి జరగబోతోంది అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇదివరకే రీతూ చౌదరి తన కాబోయే భర్తను పరిచయం చేసిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

Read more RELATED
Recommended to you

Latest news