రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకు పడ్డారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ సర్కార్ పైనా మండిపడ్డారు. బిల్కిస్ బానో అత్యాచార నిందితులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇదొక షాకింగ్ విషయమన్న ఆయన.. బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు.
‘‘షాకింగ్.. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతులైన రేపిస్టులను’ విడుదల చేసిందని వార్తలొచ్చాయి. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వమే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది చాలా చవకబారు చర్య. రేపిస్టులు, పసివాళ్లను చంపే దుర్మార్గులను కేవలం రాజకీయ లబ్ధి కోసం విడుదల చేయడం అనేది.. బీజేపీకి నీచమైన విలువలు ఉన్నా కూడా ఈ పని మాత్రం నీచాతినీచం’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Shocking!! All along it was reported that Gujarat Govt released the “Sanskari Rapists”
Turns out it is Union Govt who actually approved this! Shameful & repulsive
Letting out Rapists & Child-Killers just for political gains is a new low even by the very low BJP standards https://t.co/CNCidOeeCf
— KTR (@KTRTRS) October 18, 2022
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ.. కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నారు.