అటు మాటలతో, ఇటు హావభావాలతో నవ్వించే బుల్లితెర లేడీ కమెడియన్ రోహిణి. వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్విస్తున్న ఈ జబర్దస్త్ అమ్మడును రౌడీ రోహిణి అని కూడా అంటారు. బుల్లితెరపై నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. కామెడీ పంచులతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఓవైపు కామెడీ షోస్ చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్‌తో ఆకట్టుకుంటున్న జబర్దస్త్ రోహిణి.. ఎక్కడుంటే అక్కడ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. అలా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే.. తాజాగా ఆమె.. అందరి లైఫ్‌లో లవ్ స్టోరీస్ ఉన్నట్లే తన లైఫ్‌లో కూడా ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రేమ తనకు విషాదాన్ని మిగిల్చిందని ఎమోషనల్ అయింది.
తెలుగు బుల్లితెరపై జీ తెలుసు ‘మన ఊరి రంగస్థలం’ అనే ఓ సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. మొదటి ఎపిసోడ్ కాబట్టి.. అన్ని హంగులతో, సింగర్స్, యాక్టర్స్, స్పెషల్ పెర్ఫార్మన్స్‌లతో అదరగొట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
ఈ ప్రోమోలో భాగంగానే సింగర్స్ ఓ బ్రేకప్ సాంగ్ పాడటంతో.. శ్రీముఖి ఒక్కొక్కరిని వాళ్ల లైఫ్‌లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. అప్పుడు రోహిణి మొదటిసారి తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయింది. “తాను సిన్సియర్ గా ఓ వ్యక్తిని లవ్ చేశానని, ఒక 8 నెలలు ట్రావెల్ అయ్యాక అతనికి ఆల్రెడీ ఒక లవర్ ఉందని తెలిసిం” అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం రోహిణి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె లవ్ స్టోరీ ఏంటనేది ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.