కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసింది!

-

శ్రీ‌లంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వార్త‌ల్లో నిలిచింది. ఈ ద‌స‌రాకి మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి త‌న స్టాఫ్‌లో ఓ వ్య‌క్తిని స‌ర్‌ప్రైజ్ చేసింది. స్టార్ హీరోలు, హీరోయిన్‌లు త‌మ వ‌ద్ద ప‌నిచేసే వారికి గిఫ్ట్‌లు ఇవ్వ‌డం ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ ఎక్కువైంది. త‌నకు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించిన వారికి మాత్ర‌మే కాస్ట్‌లీ గిఫ్ట్‌లు, కార్లు అందించే హీరోలు, హీరోయిన్‌లు ఈ మ‌ధ్య ట్రెండు మార్చారు.

త‌మ వ‌ద్ద ప‌నిచేసే వారికి ఈ మ‌ధ్య గిఫ్ట్‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల త‌న ప‌ర్స‌న‌ల్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌కి కాస్ట్‌లీ కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. తాజాగా అలాంటి ప‌నినే క్రేజీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేసి త‌న స్టాఫ్‌ని ఆశ్చ‌ర్యంలో ముంచేసింది. గ‌త కొంత కాలంగా త‌న వ‌ద్ద మేక‌ప్‌మెన్‌గా వ‌ర్క్ చేస్తున్న వ్య‌క్తికి విజ‌య‌ద‌శ‌మి రోజున కొత్త కారుని గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

త‌ను న‌టిస్తున్న మూవీ షూటింగ్ సెట్‌లోనే ఆ కారుకి పూజ చేయించి మ‌రీ అత‌ని చేతిలో కీస్ పెట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. జాక్వెలిన్ పెద్ద మ‌న‌సుకి నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు. గ‌తంలో అనుష్క కూడా ఓ వ్య‌క్తికి ఇలాగే కారుని గిఫ్ట్‌గా ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Read more RELATED
Recommended to you

Latest news