IMDB లో జై భీమ్ సినిమా రికార్డు

సూర్య హీరోగా ఈ మ‌ధ్య వ‌చ్చిన సినిమా జై భీమ్. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటు సంచ‌ల‌నాలను సృష్టిస్తుంది. ఈ సినిమా కు త‌మిళ ద‌ర్శ‌కుడు టీజే జ్ఞాన‌వేల్ తెర‌కెక్కించాడు. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారం గా జై భీమ్ సినిమా ను టీ జే జ్ఞాన‌వేల్ తెర‌కెక్కించాడు. అయితే ఈ సినిమా అనేక రికార్డు ల‌ను కొల్ల గొడుతుంది.

తాజ‌గా IMDB లో తొలిస్థానాన్ని జై భీమ్ సినిమా కొట్టేసింది. 53 వేల క‌న్న ఎక్కువ ఓట్ల‌తో ఈ సినిమా IMDB లో 9.6 రేటింగ్ ను సాధించింది. అయితే ఈ సినిమా చాలా బాగుందంటు 97 శాతం గూగుల్ యూజ‌ర్లు సైతం మ‌ద్ధ‌త్తు తెల‌పారు. అయితే నిన్న‌టి వ‌ర‌కు IMDB లో షాషాంక్ రిడంప్ష‌న్ మొద‌టి స్థానంలో ఉండేది. తాజాగా IMDB లో మొద‌టి స్థానానికి జై భీమ్ సినిమా వెళ్లింది. అయితే IMDB సంస్థ సినిమాల క‌థ ల ఆధారంగా రేటింగ్ ఇస్తుంది.