జైలర్.. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో.. రజనీకాంత్ హీరోగా తమన్నా , రమ్యకృష్ణ , యోగిబాబు, వినాయక తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం జైలర్. ఆగస్టు 10వ తేదీన దక్షిణాది భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షో తోనే మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటిరోజు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మొదటి రోజే రూ.52 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి తమిళ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద ఓపెనర్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమా 32 కోట్ల రూపాయలు మొదటి రోజు సాధించి రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ జైలర్ సినిమా ముందుకు దూసుకు వెళ్ళింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. తమిళనాడు ఖాతాలో రూ .23 కోట్లు రాగా , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి రూ.10 కోట్లు వసూలు అయ్యాయి. ఇక కర్ణాటకలో రూ.11 కోట్లు రాగా, కేరళ నుంచి రూ .5కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే యూఎస్ లో కూడా 1.45 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.
మొత్తానికి అయితే మొదటి రోజే భారీ ఓపెనింగ్ తో మొదలైన ఈ సినిమా రూ.52 కోట్ల మీద కలెక్షన్స్ వసూలు చేసింది.. అంటే ఇక దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ మేనియా మొదలైంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే కలెక్షన్లను కూడా వసూలు చేసింది. రోజంతా కూడా 78.62 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లు రన్ అయ్యాయి. ఇప్పుడు వీకెండ్స్ కాబట్టి మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.