జైలర్‌ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్‌.. కౌంట్ డౌన్ షురూ

-

సూపర్ స్టార్ రజినీ కాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని తలైవా అభిమానులు చాలా ఈగర్​గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కావాలయ్య పాట సోషల్ మీడియాలో ఒక రేంజ్​లో హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఫ్లాప్​లతో సతమతమవుతున్న రజినీ కాంత్​కు జైలర్ హిట్ తీసుకువస్తుందనే ఆశ తలైవా అభిమానుల్లో మొదలైంది.

అయితే జైలర్​కు సంబంధించి మూవీ మేకర్స్ లేటెస్ట్​గా ఏ సూపర్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే.. జైలర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇంతకీ ఎప్పుడనుకుంటున్నారా..? ఇంకెప్పుడు ఈ రోజే. నిజమండీ బాబూ.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జైలర్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా, కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, ప్రియాంక అరుళ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10న పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news