అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జక్కన్న..!

-

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇండియన్ స్కూల్స్ బోర్డు ఫర్ క్రికెట్ కి గౌరవ చైర్మన్ గా నియమితులు అయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా ఎదగాలనుకునే వారిని ఈ బోర్డు గుర్తించి ప్రోత్సహిస్తుంది. మాజీ క్రికెటర్ దిలీప్ సర్కార్ గైడెన్స్ లో ఇండియన్ స్కూల్స్ బోర్డు ఫర్ క్రికెట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక తాను కూడా గతంలో క్రికెట్ ఆడేవాడిని అని.. తనకు ఈ ఆట అంటే చాలా ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా స్కూల్ టైం లో తమ ఊర్లో క్రికెట్ ఆడే వాడినని రాజమౌళి వెల్లడించడం జరిగింది.

రాజమౌళి మాట్లాడుతూ.. ఒక్క పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా యువతకు అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. కానీ వారికి సరైన ప్లాట్ఫారం లభించదు.. ఐఎస్బిసి ప్రతినిధులు తనను కలిసి రూరల్ క్రికెట్ కోసం పనిచేస్తున్నామని దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని తనను కూడా పనిచేయాలని కోరగా వెంటనే నేను ఒప్పుకున్నాను అంటూ రాజమౌళి వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని క్రికెట్ క్రీడాకారుల కోసం వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చాలా కృషి చేస్తాను అని కూడా ఆయన వెల్లడించారు.

ఇకపోతే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో అంతర్జాతీయ లెవెల్లో సినిమాని తీయబోతున్నారు ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోబోతున్న సినిమాను దుర్గ ఆర్ట్స్ పతాకం పై డాక్టర్ కే ఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news