బాండ్‌ని కూడా భ‌య‌పెట్టేసింది!

-

జేమ్స్‌బాండ్‌ని కూడా క‌రోనా భ‌య‌పెట్టేసింది. ఏడు నెల‌లుగా ప్ర‌పంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి జేమ్స్‌బాండ్ కూడా చేతులెత్తేశాడు. డేనియ‌ల్ క్రేగ్ న‌టించిన బాండ్ చిత్రం `నో టైమ్ టు డై`. డేనియ‌ల్ బాండ్‌గా న‌టిస్తున్న ఐద‌వ చిత్ర‌మిది. ఈ మూవీపై వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ అంచ‌నాలున్నాయి. అయితే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మ‌రోసారి ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేశారు.

క‌రోనా దెబ్బ‌తో ఇటీవ‌ల విడుద‌లైన `టెనెట్‌` బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. ది గ్రేట్ ఫిల్మ్ మేక‌ర్‌గా పేరున్న క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో దారుణంగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన దాఖ‌లాలు లేవు. క‌రోనా భ‌యంతో ఈ మూవీ రిలీజ్ అయిన థియేట‌ర్ల‌కి ప్రేక్ష‌కులు రావ‌డానికి భ‌య‌ప‌డ్డారు. దాంతో థియేట‌ర్ల‌న్నీ చాలా వ‌ర‌కు 20 శాతం అక్యుపెన్సీని సాధించ‌లేక‌పోయాయి. దీంతో `టెనెట్‌` భారీ న‌ష్టాల‌ని చ‌విచూడాల్సి వ‌చ్చింది.

ఇదే భ‌యం ప‌ట్టుకున్న బాండ్ ఫిల్మ్ మేక‌ర్స్ త‌మ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేస్తున్న‌ట్టు సైట్‌లో వెల్ల‌డించారు. దీంతో యావ‌త్ సినీ ప్ర‌పంచం విస్తూ పోతోంది. బాండ్ సినిమా ప‌రిస్థితే ఇలా వుంటే ఇక మా ప‌రిస్థితేంట‌ని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news