ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన రేప్ ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం కాగా దేశ వ్యాప్తంగా ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న రాహుల్ గాంధీ ని పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేయడం ఇంకా పెద్ద వివాదంగా మారింది.
అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అందరూ పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన యోగి మధ్యాహ్నం రాహుల్, ప్రియాంక సహా మరో ముగ్గురిని బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతిచ్చారు. ఇక తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆడిత్యనాధ్ ప్రకటించారు. ఈ కేసును సీబీఐ కు అప్పగించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ నేరవేరినట్టు అయింది. ఇక ఈ కేసులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.