తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా రాజకీయంగా కూడా జనసేన పార్టీని పెట్టి ప్రజల ముక్కువ పొందాలని పోరాటాలు చేస్తున్నారు ఇక పవన్ వ్యక్తిగత విషయా నికి వస్తే తను మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. మొదట వైజాగ్ చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఈమె కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
ఇక ఆ తర్వాత బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రేణు దేశాయ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు కానీ ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆమెను వివాహం చేసుకున్నారు కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో రష్యన్ మోడల్ అయినా ఆన్నా లేజినోవో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి వివాహం చేసుకున్నారు.ఇక తీన్మార్ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య సహజీవనం మొదలైందట ఇక ఈ దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె వివాహం ముందునుంచే మోడల్ కావడంతో క్రిస్టియన్ మహిళ అయినప్పటికీ హిందూ సాంప్రదాయ పద్ధతిలో కి మారిపోయింది. ఒక స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఈమె సోషల్ మీడియా కు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె పేరిట ఏకంగా రూ.1700 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఆస్తులన్నీ 2011 నుంచి పవన్కళ్యాణ్ ఆమె పేరిట కొన్ని ఆస్తులను తీసి ఉంచారు అన్నట్లుగా సమాచారం. అయితే మరికొంతమంది మాత్రం ఈమె రష్యాలో మోడల్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకుంది కాబట్టి ఇలా ఉన్నది అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి రూ.50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.