పాటకు పల్లవి ఎంత ముఖ్యమో.. విరాటపర్వానికి సాయిపల్లవి అంత ముఖ్యం: డైరెక్టర్

-

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన విరాటపర్వం చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ.. పాటకు పల్లవి ఎంత ముఖ్యమో విరాటపర్వానికి సాయిపల్లవి అంతే ముఖ్యమని చెప్పారు. నా మూలాల్లోకి వెళ్ళి నేను తీసిన సినిమా విరాటపర్వం అని అన్నారు.

ఈ సినిమాలో మవో సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పలేదు. ప్రేమే దైవం అని చెప్పామని తెలియజేశారు. మరోవైపు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ..” నటుడిగా ‘రానా’ లో ఫైర్ ఉంది. తొలి చిత్రం లీడర్ నుంచి కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఒకనాటికి రానా విన్నర్ అవుతాడు. వేణు హానెస్ట్ ఫిలిం మేకర్.సాయి పల్లవి కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం అవుతుంది. సినిమా చూడండి.” అని ప్రేక్షకులను కోరారు విక్టరీ వెంకటేష్.

Read more RELATED
Recommended to you

Latest news