Janhvi Kapoor: ‘సాగర కన్య’గా మారిన జాన్వీ…

-

 

జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ కు టాలీవుడ్ అంటే మక్కువ ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తారక్ తో కలిసి నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ మూవీ షూటింగ్ షురూ కూడా కాకముందే జాన్వీ తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసింది.

జాన్వీ తన నెక్స్ట్ తెలుగు సినిమా అక్కినేని అఖిల్ తో కలిసి చేయనుందట. ఇప్పటికే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అఖిల్ తన నెక్స్ట్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడట. ఈ హీరోకు కొత్త దర్శకుడు అనిల్ ఓ స్టోరీ చెప్పారట. ఆ స్టోరీ నచ్చడంతో అఖిల్ ఓకే చెప్పాడట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీ నిర్మించనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందనేది టాక్. అయితే ఈ సినిమాలో అఖిల్ పక్కన జాన్వీ కపూర్ నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version