షారుఖ్ ఖాన్ తొలి పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్‌మెంట్..‘జవాన్’లో నయా లుక్

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్ మెంట్ తాజాగా ఇచ్చేశారు. సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, ఆ చిత్ర టైటిల్ ను ‘జవాన్’గా తాజాగా చెప్పేశారు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

రెడ్ చిల్లి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక రిలీజ్ చేసిన ట్రైలర్ లో షారుఖ్ ఖాన్ నయా లుక్ లో కనిపించారు. ముఖంపై కట్లతో అలా కూర్చొని…నవ్వుతూ కనిపిస్తున్నారు.

తలపతి విజయ్ తో ‘పోలీసోడు’,‘విజిల్’..‘రాజా రాణి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసిన అట్లీ ప్రస్తుతం..షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version