రైతులకే ఆ నిర్ణయాన్ని విడిచి పెడుతున్నాం : నాదేండ్ల మనోహార్

-

శ్రీకాకుళం.. లావేరు మండలం బుడుమూరు గ్రామంలో రైతుబరోసా కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు పౌరసరఫరాల మంత్రి నాదేండ్ల మనోహార్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులుల మిల్లు కి వెళ్లి అమ్ముకోవాలన్న స్వేచ్ఛ రైతులకే నిర్ణయానికి విడిచి పెడుతున్నాం. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల లోపే వారి ఖాతాలలోకి డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేశాం. ఒక్క దాన్యం కొనుగోలు కోసమే 2,000 కోట్ల రూపాయలు వెచ్చించాము. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి వలసలను నివారించే కార్యక్రమాన్ని చేపడతాం.

ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రాంతానికి తాగునీటి సమస్య సాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నదని గుర్తించాము. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు అధికార యంత్రాంగం దగ్గరుండి ధాన్యం అమ్ముకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు , ఇంటర్నెట్ ప్లాంట్ , సైలో ప్లాంట్ తీసుకువచ్చేందుకు 40 కోట్ల రూపాయలు వెచ్చించాము అని తెలిపారు మంత్రి మనోహర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version