అర్జున్ రెడ్డి కాదు కబీర్ సింగ్

-

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. 2017 లో వచ్చిన సెన్సేషనల్ మూవీస్ లో ఇది ఒకటి. 4 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 40 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ వర్షన్ కు వర్మ అనే టైటిల్ పెట్టారు. కోలీవుడ్ హీరో విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా ఈ సినిమా చేస్తున్నాడు.

ఇక హిందిలో ఈ సినిమాను షాహిద్ కపూర్ చేస్తున్నాడు. మాత్రుక దర్శకుడు సందీప్ వంగ హింది సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హిందిలో కబీర్ సింగ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను 2019 జూన్ 21న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version