తనయుడితో మొదటి సారి అక్కడికి వెళ్లిన కాజల్ అగర్వాల్..!!

-

అందాల చందమామ కాజల్ అగర్వాల్..పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ విదితమే. అతనికి ‘నీల్ కిచ్లు’ అని నామకరణం చేసింది. పెళ్లి తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని పంచదార బొమ్మ డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా, డెలివరీ తర్వాత కాజల్ తన భర్త, తనయుడితో కలిసి తొలిసారి వెకేషన్ కు వెళ్లింది.

గోవాకు వెళ్లి అక్కడ హ్యాపీగా తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోంది కాజల్. గతంలో తన చెల్లెలు నిషా అగర్వాల్ కుటుంబంతో గోవాకు వచ్చిన కాజల్..ఈ సారి తన ఫ్యామిలీతో వచ్చింది. ఈ సందర్భంగా గోవాలో దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది కాజల్. ఈ ఫొటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

నీల్ తొలి హాలీడే అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు వావ్, వెరీ గుడ్ అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో కాజల్ మళ్లీ వెండితెరపైన కనబడుతుందని అభిప్రాయపడుతున్నారు. త్వరలో రీ ఎంట్రీ కన్ఫర్మ్ అని ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ లోనూ టాక్. ఇకపోతే ఈమె చివరగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో నటించింది. అయితే, ఈమె పాత్రను అనివార్య కారణాల వలన తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version