సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతూనే మరో బిజినెస్ లోకి అడుగుపెట్టేసిన కాజల్..!

-

కాజల్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాలశ్రామికవేత్త గౌతమ్ కిస్లోని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ బిడ్డ పుట్టాక కొంత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. అయితే తాజాగా సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సినిమాలతో పాటు బిజినెస్ పై కూడా పూర్తి ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది.

 

అందాల భామ కాజల్ అగర్వాల్ తన బిడ్డ నీల్ కిచ్లు జన్మించిన అనంతరం సినిమాలకు దూరంగా వస్తూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బాబుకు ఏడాది గడిచిపోయింది. ఇప్పటివరకు కొడుకు అలనా పాలనలో గడిపేసిన కాజోల్ మళ్ళీ సినిమాలపై పూర్తి ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంది. ఇటీవలే ‘ఘోస్టీ’ అనే హారర్ కామెడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, హిందీ, తెలుగు భాషల్లో ఒక్కో సినిమా చేస్తుంది. విశ్వనాథుడు కమలహాసన్ తో ఇండియన్ టు చిత్రంలో నటిస్తూ బాలకృష్ణ ఎన్.బి.కె 108 లో సైతం కాజల్ నటిస్తోంది. ఒక పక్క వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్న కాజల్ బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

ఇప్పటికే పలు బిజినెస్ లతో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా కంటికి పెట్టుకునే కాటుక (కాజల్) ని బ్యూటీ ప్రోడక్ట్ గా మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ కాజల్ తన సోషల్ మీడియా ద్వారా ప్రోడక్ట్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కాజల్ గతంలో తన భర్త గౌతమ్ ఇంటీరియర్ బిజినెస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా భాగం అయ్యిన సంగతి తెలిసిందే. ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు బిజినెస్ తో ఖాళీ లేకుండా గడిపేస్తుంది చందమామ.

Read more RELATED
Recommended to you

Exit mobile version