తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన నటించిన చందమామ చిత్రంతో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మగధీర తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన నటన అందంతోని ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఎక్కువగా స్టార్ హీరోలతోనే పలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది.
అలా స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే తన చైల్డ్ ఫ్రెండ్ అయిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుంది. ఇక అప్పటినుంచి ఆమె జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నది ఇక ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు, తన కుటుంబానికి సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది. పెళ్లి తర్వాత కూడా సినిమాలలో బాగానే అవకాశాలు అందుకున్నా.. తను గర్భవతి అవ్వడంతో కొన్ని సినిమాలకు దూరంగా ఉన్నది. అలా గర్భవతిగా ఉన్న సమయంలో వర్క్ అవుట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది కాజల్ అగర్వాల్.
అయితే ఇటీవల ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో ఈమె అభిమానులకు కూడా కాస్త ఆనందాన్ని తెలియజేశారు. కాజల్ తన కొడుకు ఫోటోలు పంచుకోగా ఇప్పటివరకు తన కొడుకు ఫేసును సరిగ్గా చూపియ్యలేదు. కాజల్ అగర్వాల్ శరీరంలో పలుమార్పులు రావడంతో ఆమె మునుపటిలాగా కనిపించడం కోసం ఎన్నో వర్కౌట్లు కూడా చేస్తూ ఉంది. పైగా తన వర్కౌట్లకు సంబంధించి కొన్ని వీడియోలను మళ్ళీ అభిమానులతో పంచుకుంది. అలా షేర్ చేస్తూ ప్రస్తుతం ఈమె ఎనర్జీగా లేనట్లుగా ఉంది. మామూలుగా చూడడానికి ఫిట్ గా ఉన్నా కానీ అంత యాక్టివ్ గా లేదని చెప్పవచ్చు. ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేస్తూ కాస్త బాధ పడినట్లుగా ఒక వీడియోని షేర్ చేసింది.