పరిశ్రమలో ఉంటూ ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కొందరు మాత్రం ఈ ఇండస్ట్రీపై నెగటివ్ ఫీలింగ్ తో ఉంటారు. తమ కెరియర్ కు ఇంతగా ఉపయోగపడిన ఈ ఫ్లాట్ ఫాంకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. ఇంతకీ ఎందుకు ఈ క్లాసంతా అనుకోవచ్చు.. సిని పరిశ్రమలో హీరో అయినా.. హీరోయిన్ అయినా వచ్చే ముందు ఒకలా వచ్చిన తర్వాత మరోలా మారుతుంటారు.
ఏ పరిశ్రమలో అయినా కొన్ని మంచి చెడులు ఉంటాయి. అయితే అసలు విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్లు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లని పెళ్లాడాలంటే ఇష్టపడరు. ముఖ్యంగా హీరోయిన్స్ మీద ఆ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అయితే అది పక్కన పెడితే హీరోయిన్ కాజల్ రీసెంట్ ఇంటర్వ్యూలో పెళ్లికి కొద్దిగా టైం ఉందని చెప్పగా.. పరిశ్రమలో వ్యక్తిని మాత్రం అసలు పెళ్లి చేసుకునేది లేదని కరాకండిగా చెప్పింది.
అయితే ఈ మాట హీరోయిన్ అన్నది కాబట్టి పెద్ద ఇష్యూ కాలేదు. ఇదే మాట ఎవరైనా హీరో అని ఉంటే మాత్రం అతని తాట తీసేలా మీడియా రచ్చ మొదలు పెట్టేది. ఈ తేడా ఎక్కడ ఉందో తెలియదు కాని హీరోయిన్స్ అంటే ఒక అర్ధం అదే హీరోలు అంటే మరొక అర్ధం వచ్చేలా మీడియా వార్తలు రాస్తుంది. మరి కాజల్ కామెంట్స్ పై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.