kajal agarwal : ప్రెగ్నెన్సీ ఫోటోలు షేర్‌ చేసిన కాజల్‌..

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. గతేడాది ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ గౌతమ్‌ కిచ్లూను కాజల్‌ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను ఆచి..తూచి చేస్తుంది. ఇక తాజాగా ప్రెగ్నెన్సీ రావడంతో… పూర్తిగా సినిమాల నుంచి తప్పుకుంది హీరోయిన్ కాజల్‌. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కాజల్‌ భర్త గౌతమ కిచ్లు కాజల్‌ ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించాడు.

ఇది ఇలా ఉండగా… తాజాగా కాజల్‌ మరో సంచలన పోస్టు చేసింది. బేబీ బంప్‌ ఉన్న ఫోటోలను షేర్‌ చేసి.. ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ కూడా చేసింది కాజల్‌ అగర్వాల్‌. ఇక ఈ ఫోటోల్లో బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

” గర్భధారణ సమయంలో, మన శరీరాలు బరువు పెరగడంతో పాటు అనేక మార్పులకు గురవుతాయి!! హార్మోన్ల మార్పులు శిశువు పెరిగేకొద్దీ మన కడుపు, రొమ్ములు పెద్దవిగా మారతాయి. మన శరీరం నర్సింగ్‌కు సిద్ధమవుతుంది. కొందరికి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మన చర్మం మొటిమలతో నిండిపోతుంది. కానీ గర్భ దారణ సమయంలో.. కుటుంబం సలహాలు తీసుకోవాలి. మీకు ఏం కావాలో వారికి చెప్పండి. వ్యాయామాలు చేయండి” అంటూ కాజల్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version