అన్ స్టాపబుల్ కు కమల్ హాసన్.. ఎప్పుడంటే..!

-

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఎంతగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.. ఇప్పటికే ఈ షోకు పలువురు సినీ ప్రముఖులు వచ్చి అలరించారు.. అయితే త్వరలోనే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆహా లో ప్రసారమవుతున్న ఈ టాక్ షోకు ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం వచ్చి అలరించారు తాజాగా గోపీచంద్ ప్రభాస్ వచ్చి తమదైన శైలిలో అల్లరి చేశారు అలాగే దగ్గుబాటి సురేష్ బాబు అల్లు అరవింద్ రాఘవేంద్రరావు ప్రముఖులు వచ్చి తమ అనుభవాలు పంచుకున్నారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షో కి వచ్చి ఆసక్తికర విషయాలు పంచుకున్నట్టు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించిన షో ఇంకా అప్పుడే రాలేదు.. సంక్రాంతి సందర్భంగా రాబోతుందని వార్త వినిపిస్తుంది.. సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా అభిమానులు ముందుకి రాబోతుంది ఈ సందర్భంగా ఈ షోను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.. అయితే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా ఈ షో కు రాబోతున్నారని తెలుస్తోంది..

బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ అన్ స్టాపబుల్ షోలోకి వస్తుండగా తండ్రి కమలహాసన్ కూడా సందడి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కమల్ హాసన్ తో బాలయ్య బాబుకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. దీంతో కమల్ హాసన్ ఈ షోకు వచ్చి సందడి చేయబోతున్నారని తెలుస్తోంది అయితే ఒకప్పుడు కమలహాసన్ బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా చేయటానికి కూడా పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు అయితే స్క్రిప్ట్ కుదరక మనకు కొన్ని కారణాలతో ఈ విషయం ముందుకు వెళ్లలేదు ఇప్పుడు మాత్రం కమలహాసన్ షో కి వస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకోవడంతో పాటు తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలు చెప్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి అసలు విషయం ఏంటి తెలియాలంటే కొన్ని రోజులు ఆడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news