“వారిసు” ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన థలపతి

-

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం వారిసు. తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో విజయ్ కి అన్నయ్య పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు.

దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, జయసుధ, కుష్బూ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీ ఈనెల 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ” రంజితమే ” సాంగ్ రిలీజ్ అయ్యి 100 మిలియన్ న్యూస్ రాబట్టి టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస అప్డేట్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్.

ఈ నేపథ్యంలోనే ఈ మూవీ తమిళ్ ట్రైలర్ ని విడుదల చేశారు. విజయ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుండడంతో వారిసు ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో తన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్. ఇక ఈ మూవీ తెలుగు ట్రైలర్ ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news