ఇండియన్-2 ప్రీ లుక్.. మాటల్లేవంతే..!

-

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన సినిమా ఇండియన్. తెలుగులో భారతీయుడుగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. అప్పట్లోనే నేషనల్ వైడ్ గా ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం శంకర్ రోబో సీక్వల్ గా 2.ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అవగానే ఇండియన్-2 సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట.

ఈ సినిమా కన్ఫాం చేస్తూ లేటెస్ట్ గా ఓ ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమాలో కమల్ సిగ్నేచర్ అయిన మణికట్టు మంత్రాన్ని చూపిస్తూ ప్రీ లుక్ వదిలారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలు అన్నిటిని మరోసారి కడిగి పారేసేలా ఇండియన్-2 సినిమా ఉంటుందని తెలుస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా నిర్మించడం విశేషం. మొదట ఈ సినిమాను తెలుగు బడా నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేయాలని చూడగా శంకర్ తో సినిమా అంత ఈజీ కాదని చెప్పడంతో వెనక్కి తగ్గాడు. ఫైనల్ గా ఇండియన్ 2 ప్రీ లుక్ అదిరిపోగా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version