డిగ్రీ తర్వాత మిలిటరీ ట్రైనింగ్ తప్పనిసరి చేయాలన్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ సినిమాలతో భారీ పాపులారిటీని దక్కించుకొని తన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితురాలుగా మారిపోయింది.
ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బయోపిక్ లు తీస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న కంగనా రనౌత్ 500 రూపాయలతో ఇంటి నుండి పారిపోయి ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ క్వీన్ కంగానా రనౌత్ నటించిన ‘తేజాస్’ ఈనెల 27న రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా మారిన ఆమె మిలిటరీ గురించి ఆసక్తికర వాక్యాలు చేశారు. దేశంలో డిగ్రీ పూర్తవగానే ప్రతి ఒక్కరికి మిలిటరీ ట్రైనింగ్ తప్పనిసరి అనే నిబంధనలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల దేశంలో సోమరితనం పోయి బాధ్యత, క్రమశిక్షణ పెరుగుతాయన్నారు. దీంతో పాటు విదేశీ వస్తువులను కూడా బాయ్ కాట్ చేయాలని అభ్యర్థించారు ఆమె.