మాస్ మహారాజ రవితేజ తొలి పాన్ ఇండియా సినిమా రిలీజ్కు రంగం సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ రన్‌టైమ్ గురించి చిత్రబృందం ఓ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఏకంగా 3.02 గంటలు ఉండనుందట. ఈ విషయాన్ని చిత్రబృందం నెట్టింట పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు వామ్మో అంతసేపా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మరోవైపు ఈ ఏడాది అత్యధిక రన్‌టైమ్ ఉన్న సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ నిలిచింది. ఇంత రన్‌టైమ్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.