తాను అసలు సిసలైన దేశభక్తురాలినని, అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని బాలీవుడ్ నటి కంగానా రనౌత్ ప్రకటించారు. పి. వాసు దర్శకత్వంలో నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘చంద్రముఖి-2’ చిత్రం ఈ నెల 15న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం చెన్నైలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంగానా రనౌత్ మాట్లాడుతూ… రాజకీయాల్లో అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. తాను దేశభక్తురాలినని, అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఏపీ పర్యాటక శాఖ మంత్రి, నటి రోజా చేసిన వాక్యాలను విలేకరులు ప్రస్తావించగా…”రోజా అంటే ఎవరు? అలాంటి వారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేనేం మాట్లాడతాను? ” అన్నారు.