కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. ప్రస్తుత లోక్ సభ ఎంపీ. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పడం ఈ భామకు అలవాటు. ఇక బాలీవుడ్ తీరుపై తరచూ విమర్శలు గుప్పిస్తుంటుంది. తాజాగా కంగన మరోసారి బీ టౌన్ పై విమర్శలు గుప్పించింది. కంగన నటించిన ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రానుంది. ప్రస్తుతం కంగన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంగన బాలీవుడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో ఫ్రెండ్స్ ఉన్నారా? అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నేను బాలీవుడ్‌కు సెట్ అయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ స్నేహితులు లేరు. వాళ్లందరి లైఫ్ స్టైల్ వేరు. నా లైఫ్ వేరు. ఇక బాలీవుడ్ పార్టీల్లో వారు మాట్లాడుకునే మాటలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. నా దృష్టిలో బాలీవుడ్ పార్టీలంటే ‘ఓ ట్రామా’. ” అని కంగన చెప్పుకొచ్చింది.