జూనియర్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ 31 వ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్.. హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర… బృందం… హీరోయిన్ రుక్మిణి వసంతతో చర్చించారట. దీనికి… రుక్మిణి వసంతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవల ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో జాన్వి హీరోయిన్ గా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయి సక్సెస్… కలెక్షన్లను రాబడుతోంది.ఇప్పటికే ఈ సినిమా 300 కు పైగా కోట్లను… రాబట్టింది.