నాగార్జునతో బిగ్‌బాస్ వేదికను పంచుకున్న సుదీప్..!

-

బుల్లితెరపై బిగ్ బాస్ షో తనదైన శైలిలో దూసుకెళ్తుంది. ఇప్పటికే తెలుగులో ఈ శనివారంతో 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారంలో అడుగుపెట్టింది. ఇప్పటికే మూడు సీజన్స్‌లో మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విజేతలుగా నిలిచారు. కాబట్టి.. ఈ సారి బిగ్‌బాస్ 4 విజేతగా ఫీమేల్ కంటెస్టెంట్‌కు వచ్చే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి టాప్ 7 కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్నారు. అయితే ఆదివారం ఎపిసోడ్ కి కన్నడ బిగ్ బాస్ హోస్ట్ సుదీప్ గెస్ట్ గా ఆహ్వానించారు.

nagarjuna
nagarjuna

ఈ వారం హౌస్‌లో కన్నడ బిగ్‌బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ ముఖ్యఅతిథిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో బిగ్‌బాస్ షోకు హాజరైన విషయాన్ని సుదీప్ సోషల్ మీడియా వేదిగా వెల్లడించాడు. నాగార్జునతో కలిసి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేయనున్నారు. మరి సుదీప్ రాకతో బిగ్‌బాస్ హౌస్‌ కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి మరి. అయితే ఈ వారం అవినాష్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో మనోడు ఎలిమినేట్ అయిపోయాడు. అనుక్షణం నామినేషన్ అంటే వణికిపోయే అవినాష్‌కు ఇది నిజంగా షాకే. అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి తనను తాను సేవ్ చేసుకున్నాడు అవినాష్.

అలా ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బయటికి వెళ్లలేదు. దాంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత నాలుగు వారాల్లో రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి.. చివరి రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. అందులోంచి ముగ్గురు వెళ్లిపోయి టాప్ 2 మిగులుతారు. టాప్ 2ను స్టేజీపై పిలిచి వాళ్లలో విజేత ఎవరో ప్రకటిస్తారు. అలా 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ లేకుండానే ముగించేసేసారు నిర్వాహకులు.

Read more RELATED
Recommended to you

Latest news