ఆమె వల్లే కన్న కూతురికి కూడా దూరం అయ్యా – జోగి నాయుడు

-

తెలుగులో యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె పేరు తెలియని వారంటూ తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా పేరు సంపాదించిన ఈమె పలు సినిమాలలో కమెడియన్ గా కూడా బాగానే ఆకట్టుకుంది. ఝాన్సీ భర్త జోగి నాయుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జోగి నాయుడు కూడా కమెడియన్గా పలు చిత్రాలలో నటించి బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్డుగా విధులు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఒక చానల్లో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. యాంకర్ ఝాన్సీ తో పరిచయం దగ్గర నుంచి విడిపోయే వరకు ఆ తర్వాత రెండో వివాహం చేసుకునే వరకు పలు విషయాలను తెలియజేశారు.. జోగి నాయుడు మాట్లాడుతూ ఝాన్సీ తనను 1995 లో మొదటిసారి కలిసిందట. అప్పుడు ఆమె ఇంటర్ చదువుతోందని తానేమో జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడట. అలాంటి సమయంలోనే ఆమెతో పరిచయం ఏర్పడి త్వరగా ప్రేమగా మారి వివాహం చేసుకున్నామని ఆ తర్వాత ఇద్దరం కలిసి 9 ఏళ్లు ఉన్నామని.. కానీ పెళ్లయ్యాక ఏడాది కూడా కలిసి ఉండలేకపోయాము. అప్పటికే మాకు ధన్య అనే పాప కూడా జన్మించింది అని తెలిపారు

.

తన కూతుర్ని చూడడానికి చాలా కష్టపడ్డాడట. తనని వదిలి వెళ్ళలేక చాలా సతమతమయ్యే వాడినని మమ్మల్ని కలపడానికి చిరంజీవి గారు , బ్రహ్మానందం గారు చాలా ప్రయత్నించి గంటల తరబడి మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది అని తెలిపారు. అయితే ఝాన్సీ మాత్రం తనతో కలిసి ఉండడానికి ఒప్పుకోలేకపోవడంతో విడాకులు తీసుకున్నామని తెలిపారు. అయితే తన కూతుర్ని మాత్రం చిన్నప్పుడు తల్లి దగ్గర పెద్దయ్యాక తన దగ్గర ఉండేలా కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికి వారానికి ఒకసారి తన కూతుర్ని చూడడానికి వెళుతూ ఉంటానని తెలిపారు జోగి నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version