వ్యాక్సిన్ వార్‌ మూవీలో ‘కాంతార’ హీరోయిన్

-

ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయ దిశగా నిలిచిన చిత్రం కాంతారా. ఈ సినిమా విడుదలై ఎన్నో సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటి లో కూడా బాగానే ఆకట్టుకుంటోంది. అయితే,  కశ్మీర్ ఫైల్స్ తర్వాత వివేక్ అగ్నిహోత్రి తెరకేకిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

‘వెల్కమ్ సప్తమి. ఈ చిత్రంలో నీ పాత్ర చాలామంది హృదయాలను తాకుతుంది’ అని అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. దీనికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. కాగా, ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో నేడు మొదలవనుంది. ఆగస్టు 15న మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version