అందం పుట్టాక ఆడవాళ్లు పుట్టారో.. ఆడవాళ్లు పుట్టాక అందం పుట్టారో తెలియదు కానీ..ఈ రెండూ మాత్రం ఒకే దగ్గర ఉంటాయి.. ఒకవేళ లేకున్నా.. ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.. కాళ్ల దగ్గర నుంచి జుట్టు వరకూ అందంగా ఉండాలనుకుంటారు.. పార్లల్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్ ఇలా బోలెడు చేయించుకుంటారు.. ఇవి అన్నీ మామూలే.. అయితే ఓ మహిళ కూడా ఇలానే చేయించుకుంది..కానీ ఆమె క్యాన్సర్ బారిన పడింది.. కారణం.. మెనిక్యూర్..
యూఎస్‌కి చెందిన గ్రేస్ గార్సియా తన చేతులకి మానిక్యూర్ చేయించుకునేందుకు పార్లర్‌కి వెళ్ళింది. గోర్లు శుభ్రంగా చేసేందుకు నిర్వహించిన క్లీనింగ్ సెషన్ కాస్త నొప్పిగా అనిపించింది. కానీ సెషన్ పూర్తి చేసిన తర్వాత తన క్యూటికల్స్‌లో కొద్దిగా నొప్పి మంటగా అనిపించింది. కొన్ని రోజులకి గోర్లు దగ్గర చిన్న పుండు వచ్చిందట.. కుడి వేలుకి అయిన తన గాయం మూడు నెలలు అయినా నయం కాలేదు. దీంతో అనుమానం వచ్చిన గ్రేస్ చర్మవ్యాధి నిపుణులని కలిసింది. గాయపడిన వేలిని బయాప్సీ చేశారు. పరీక్షల్లో ఆమెకు పొలుసుల కణ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.. ఇది చర్మ క్యాన్సర్ నాన్ మెలనోమా రూపం.
హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందని వైద్యులు తెలిపారు.. చేతుల అందం కోసం తను చేయించుకున్న మానిక్యూర్ కారణంగా క్యాన్సర్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. హెచ్ పివి వల్ల వచ్చే గోరు క్యాన్సర్ చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు..
ప్రపంచంలోని అత్యంత సాధారణ క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ ఒకటి. నాన్ మెలనోమా రకం క్యాన్సర్ చర్మంపై పొరల్లో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి..
చర్మంపై రంగు మారిన పాచ్‌లు ఏర్పడటం, పుండ్లు ఏర్పడి కొన్ని నెలల పాటు ఉంటాయి, కాలక్రమేణా ఎక్కువ అవుతాయి, చర్మం మీద ఎరుపు, గట్టిగా ఉండే ముద్దలు లేదా పొక్కులు ఏర్పడటం, చర్మం పొలుసులుగా ఉండటం జరుగుతుంది.. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే వీటికి కూడా చికిత్స ఉంటుంది. క్యాన్సర్ రకాన్ని బట్టి చికిత్స చేస్తారు.