ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంతారా హీరో..!!

-

చిన్న సినిమాగా విడుదలై ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించుకున్న సినిమా కాంతారా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగుతోందని చెప్పవచ్చు. కాంతారా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయినటువంటి రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సినిమా ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలయ్యి భారీ స్థాయిలో ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్తో తరికెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది . దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చెప్పవచ్చు. ఈ సినిమాపై రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా కాంతారా సినిమా గురించి ప్రశంసలు కురిపించిన వారిలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి తనకు విష్ చేసిన వారిలో ప్రభాస్ కూడా ఉన్నారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

అయితే ప్రభాస్ తనకు కాల్ చేసి విష్ చేశారు అని…కానీ అదే సమయంలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పట్టించుకోలేదని..చాలా లైట్ తీసుకున్నారని.. సినిమా గురించే గంటల తరబడి మాట్లాడారు అని తెలిపారు రిషబ్ శెట్టి. అలా ప్రభాస్ మాట్లాడే సరికి కాంతారా సినిమా ప్రజలకు ఎంతగా నచ్చిందో అప్పుడే అర్థమైందని ఆయన తెలిపారు. మొత్తానికైతే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేత ప్రశంసలు పొందిన రిషబ్ శెట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news