“వాల్తేరు వీరయ్య” నుంచి రవితేజ మాస్‌ ఎంట్రీ..ఇక ఫ్యాన్స్‌ కు జాతరే

-

మెగాస్టార్​ చిరంజీవి చేస్తున్న లెటేస్ట్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజవి సరసన శృతి హాసన్, కాథరిన్ ట్రెసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది.  ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.  అయితే, తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్ డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేస్తున్న రవితేజ టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.  ఇక ఈ టీజర్‌ లో ఓ మేక పిల్లను పట్టుకుని పులిలా ఎంట్రీ ఇచ్చేశాడు రవితేజ. అలాగే తెలంగాణ యాసలో దుమ్ములేపేశాడు రవితేజ. కాగా జనవరి 13 వ తేదీన వాల్తేరు వీరయ్య రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news