కపటధారి ట్రైలర్: మిస్టరీని చేధించే ట్రాఫిక్ పోలీస్..

కెరీర్లో పెద్ద తొందరపడకుండా చాలా కూల్ గా సినిమాలు చేసుకుంటూ పోయే వారిలో హీరో సుమంత్ కూడా ఒకరు. రెండేళ్లకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సుమంత్, తాజాగా కపటధారి సినిమాతో వస్తున్నాడు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ ఈ రోజే విడుదలైంది. ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు అన్నింటికీ ఓ కారణం ఉంటుందన్న డైలాగ్ తో టీజర్ మొదలై, ఏదో మిస్టరీని చేధించే దిశగా సాగుతుంది.

ట్రాఫిక్ పోలీస్ అయిన సుమంత్ ఆ మిస్టరీని చేధించాలనుకుంటాడు. దానికోసం పై అధికారుల అనుమతి తీసుకోవాలని చూస్తాడు. ట్రాఫిక్ పోలీస్ ఇన్వాల్వ్ మెంట్ నచ్చని పై అధికారులు, ఇందులో జోక్యం చేసుకున్నావంటే సస్పెండ్ చేసి పడేస్తాం అని అనడం, అయినా కూడా సుమంత్ తనకి తానుగా మిస్టరీని చేధించే పని చేపట్టడం జరిగిపోతున్నట్టు చూపించారు. ఐతే చివర్లో ట్రాఫిక్ పోలీస్ పై నెగెటివిటీ వచ్చేలా చేయడం ఆసక్తి రేకెత్తించింది. నందితా శ్వేత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. నాజర్ మరో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.