విక్రమ్‌ని ఇర్ఫాన్‌ పఠాన్‌ కాపాడతాడా…?

విక్రమ్‌ ఎంత ట్రై చేసినా సక్సెస్‌ రాట్లేదు. ఎన్ని జానర్లు మార్చినా వర్కవుట్ కాట్లేదు. దీంతో మాజీ క్రికెటర్‌ని రంగంలోకి దింపాడు విక్రమ్. ఈ ప్లేయర్‌ సపోర్ట్‌తో అయినా గేమ్‌ గెలవాలని ఆశ పడుతున్నాడు. విక్రమ్‌ సరైన హిట్‌ కొట్టి 15 ఏళ్లు అవుతోంది. “అపరిచితుడు’ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌ హిట్‌ లేదు. ఇక కొంతకాలం నుంచి బాక్సాఫీస్‌ దగ్గర అస్సలు నిలబడలేకపోతున్నాడు విక్రమ్. దీంతో చియాన్ మార్కెట్‌ మొత్తం పడిపోయింది, కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరిందనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఈ డేంజర్‌ జోన్‌ నుంచి బయటపడ్డానికి మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ హెల్ప్ తీసుకుంటున్నాడు విక్రమ్.

విక్రమ్ “కోబ్రా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఒక రోల్‌ ప్లే చేస్తున్నాడు. ఫ్రెంచ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ అస్లాన్ ఇల్మాజ్ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు ఇర్ఫాన్. మాజీ క్రికెటర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌కి ఇండియా వైడ్‌గా గుర్తింపు ఉంది. ఈ ఇమేజ్‌ “కోబ్రా’ సినిమాకి ప్లస్‌ అవుతుందని, మంచి బిజినెస్‌ జరుగుతుందని ఆశ పడుతున్నాడట విక్రమ్. మరి సొంతంగా బాక్సాఫీస్‌ని ఎదుర్కోలేకపోతోన్న విక్రమ్‌కి, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎంత వరకు హెల్ప్‌ చేస్తాడో చూడాలి.