కపిల్ దేవ్ బయోపిక్ “83” కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారా ..?

-

మేకర్స్ అనుకుంటున్నారా లేదా అన్నది తెలియకుండానే వాళ్ళు నిర్మించిన సినిమా గురించి రక రకాల వార్తలు రాసే వాళ్ళు ఈ మద్య కాలంలో విపరీతంగా పెరిగిపోయారు. కోట్లు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో నిర్మించిన సినిమాలని ఎంత ఆలస్యం అయినా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు పట్టుదలగా ఉంటే గాసిప్ రాయుళ్ళు మాత్రం ఆ సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది…ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట అంటూ గాసిప్స్ రాసేస్తున్నారు.

 

ఇప్పుడు కూడా ఒక బయోపిక్ గురించి ఇలాంటి వార్తలే వస్తున్న నేపథ్యంలో వాళ్ళ సినిమా ఎందులో రిలీజ్ చేయాలనుకుంటున్నారో తేల్చి చెప్పారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బయోపిక్ 83. ఇండియా జట్టుకు సారథ్యం వహించిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ బయోపిక్ ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని హిందీ తో పాటు తెలుగులో కూడా ఏప్రిల్ విడుదల చేయాలనుకున్నప్పటికి కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో సౌత్ లో రిలీజ్ కి రెడీగా కొన్ని సినిమాలని ఓటిటీలో రిలీజ్ చేయడానికి ఆయా సినిమాల మేకర్స్ సిద్దమవుతున్నారు. దాంతో 83 ని కూడా ఓటిటీలో రిలీజ్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే అవన్ని కేవలం గాసిప్స్ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. పరిస్థితులు చక్కబడితే ఆగష్టు లో ఈ సినిమాని డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. కపిల్ భార్య పాత్రలో రణ్ వీర్ సింగ్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version